టైటిల్ : అభిమన్యుడు
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం : విశాల్‌, అర్జున్‌, సమంత, ఢిల్లీ గణేష్‌ తదితరులు
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత : విశాల్‌
దర్శకత్వం : పీఎస్‌ మిత్రన్‌

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్‌, టాలీవుడ్‌లో మార్కెట్‌ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. కోలీవుడ్‌ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు.

నటీనటులు :
విశాల్‌ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్‌ లుక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్‌. వైట్‌ డెవిల్‌ పాత్రకు అర్జున్‌ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్‌ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్‌, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్‌.

ప్లస్ పాయింట్స్ :
అర్జున్‌ నటన
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ :
తొలి భాగంలో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

రేటింగ్ : 3.25/5

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments