గురు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు . ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు ,ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి క్రేజీ మల్టీస్టారర్ లో నటించనున్నారు . బాబీ దర్సకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి ఒక సినిమా చేయనున్న విషయం తెలిసినదే , ఈ చిత్రంలో పాత్ర కూడా చైతు కు మామ గానే . ఈ మల్టీస్టారర్ లో వెంకీ కి జోడిగా కాలా సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నటించిన హ్యూమా ఖురేషి నటించనున్నట్లు సమాచారం . ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు చిత్రబృందం త్వరలోనే వెల్లడిస్తారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments