ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన ఆలోచనను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటున్న విషయం తెలిసినదే  . తాజాగా ఆయన పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాట యాత్ర పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన అనుకున్నట్టుగానే పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు . తాను కూడా గతంలో చాలా సార్లు పవన్ ను పార్ట్ టైం పాలిటీషియన్ అన్నాని కాని ఇప్పుడు పవన్ జనంలోకి వెళ్ళిపోయి వాలా సమస్యలు తెలుసుకుంటున్నారని అదే నాయకుడి ఒక్క లక్షణమని అన్నారు . తాను ముండే పవన్ కల్యాణ్ కు పర్యటనలో తిరగడమే కాకుండా మంచి అభ్యర్ధులను ఎన్నుకోవాలని వీడియో ద్వారా తెలియజేశానని , 175 నియోజికవర్గాలలో జనసేన పోటీ చేయడం మంచిదని అన్నారు . పవన్ కేవలం బహిరంగ సభలతో సరిపెట్టుకోకుండా అక్కడ ఉన్న ప్రజలతో , ఊరి పెద్ద మనుషులతో చర్చించి అక్కడ ఉన్న నిజాయితీ గల అభ్యర్ధులను ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు . ఇంకా మాట్లాడుతూ పవన్ తన వెనక ఉన్న వాళ్ళను గుడ్డిగా నమ్మితే తమ సమస్యలు చెప్పుకునే ప్రజలు మోసపోతారని , అలాగే కనుక జరిగితే ప్రజలు జనసేన మీద విశ్వాసం కోల్పోతారని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments