తెలుగులో బుల్లితెరపై మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్ . ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ పూర్తయ్యి మంచి ఆదరణ పొందింది . ఇప్పుడు నాని హోస్ట్ గా రెండోవ సీజన్ మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది . జూన్ 10 నుండి ఈ షో ప్రసారం కానుంది . 100 రోజుల పాటు కొనసాగనున్న ఈ షో లో మొత్తం 16 మంది పాల్గొనబోతున్నారు . అయితే తాజాగా ఈ షో లో పాల్గొనే సెలబ్రిటీస్ లిస్టు ఒకటి వైరల్ అవుతోంది .

ఈ లిస్టు ప్రకారం హీరో రాజ్ తరుణ్ , సింగర్ గీతా మాధురి , యాంకర్ శ్యామల , యాంకర్ లాస్య , హీరోయిన్ రాశి , హీరోయిన్ చార్మి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి, శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, ఆర్యన్‌ రాజేష్ ఈ షో లో పాల్గొననున్నారు . ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌ అని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య తెలుగు చిత్రసీమలో వేధింపులు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి బిగ్ బాస్ 2 లో  పాల్గొనబోతుందనే వార్త షాకింగ్‌గా మారింది. శ్రీరెడ్డి నేచుర‌ల్ స్టార్ నాని, వైవా హ‌ర్షల‌పై కూడా పలు కామెంట్స్ చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న16 సెలబ్రిటీలలో ఎంతమంది నిజంగా షోలో ఉన్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments