స్వాజిత్ మూవీస్ బ్యానర్ పై శ్రీమతి స్వప్న సమర్పణలో సుందర్ సూర్య దర్సకత్వంలో నగశౌర్య , షామిలీ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా అమ్మమ్మగారిల్లు . ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసినదే . ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాదులో మంగళవారం సాయంత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ కార్యక్రమంలో రావు రమేష్ , శివాజీ రాజా , హేమ , సుధ తదితరులు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా రావు రమేష్ మాట్లాడుతూ “అన్ని పాత్రలు సినిమాలో బాగా పండాయి . సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య . ఆ తర్వాత సుధ , శివాజీ రాజా పాత్రలు . ఆ పాత్రలలో అందరూ లీనమై నటించారు కాబట్టి ఇంత మంచి పేరు వచ్చింది . 2008 నుంచి 2018 వరకూ ప్రతీ రోజు నాకు గుర్తిండిపోతుంది. నా అనుభవాలను ఇతరులతో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది . ఈ పదేళ్లు నా లాక్ ఏజ్. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.