జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలపై దృష్తి పెట్టి పోరాట యాత్ర చేస్తున్న విషయం తెలిసినదే . ఈ విషయం పై గతంలో ఓ కార్యక్రమంలో రాంచరణ్ ను ఒక విలేఖరి జనసేన పార్టీ గురుంచి అడగగా చరణ్ తాను జనసేన కు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని , తన బాబాయ్ పవన్ పిలుపు కోసం వేచి చూస్తునట్టు తెలిపారు . ఇప్పుడు ఈ విషయం పై జనసేనాని పవన్ స్పందించారు . ఆయన మాట్లాడుతూ “ఎవరైనా స్వతహాగా వస్తే నా పార్టీలోకి ఆహ్వానిస్తా . అంతేగానీ నా కుటుంబ సభ్యులను రమ్మని అడగను . రాజకీయాల్లోకి రావాలంటే ఒకరికి పదిసార్లు ఆలోచించుకోవాలి . రాజకీయాలలోకి రావాలంటే చాలా నిబద్దతతో ఉండాలి . సంతోషకరమైన జీవనం గడుపుతున్న వారు రాజకీయాల్లోకి ఎందుకు ?” అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments