జనసేన అధినత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర లో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన నిరసన కవాతులో పాల్గొని అనంతరం పాట బస్టాండ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు . పవన్ మాట్లాడుతూ అమరావతి , విజయవాడ , గుంటూరులోనే అభివృద్ధి చేస్తే మళ్ళీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలవుతుందని , ఇతర ప్రాంతాలను సీఎం చంద్రబాబు పట్టించుకోకపోతే రాయలసీమ , ఉత్తరాంధ్ర , కోస్తాంద్రగా మూడు ముక్కలవుతుందని హెచ్చరించారు .  తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు .

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పరిశ్రమలు , ఉద్యోగాలు , సాగునీరు లేవని పవన్ అన్నారు . గతంలో హైదరాబాదులో చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ చేస్తున్నారని , అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు . జనసేన వల్లే ఉద్దానం సమస్య బయటకు వచ్చిందని , నాలుగేళ్ల క్రితం పెట్టిన పార్టీ ఇంత చేయగలిగినప్పుడు ఇన్నేళ్ళుగా ఉన్న పార్టీలు , ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని పవన్ ప్రశ్నించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments