జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర విజయనగరం జిల్లా కురుపాం కు చేరుకుంది . ఈ సందర్భంగా పవన్ బహిరంగ సభలో మాట్లాడుతూ 90 శాతం మంది గిరిజనులు ఉన్న కురుపాం నియోజికవర్గంలో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని తెలిపారు . గిరిజనులు , సామాన్యుల సమస్యలను తెలుగుదేశం పార్టీ పరిష్కరిస్తుందని భావించానని అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు . రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని కేవలం ఓట్ల కోసమే గిరుజనుల వద్దకు రాజకీయ పార్టీలు వస్తున్నాయని ఆదేదన వ్యక్తం చేశారు .

ఇంకా మాట్లాడుతూ మహానాడు కోసం డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పూర్ణపాడు లేబేసు వంతెనను నిర్మించలేకపోతోందని విమర్శించారు . కురుపాంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని అన్నారు . కేవలం ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రమే రోడ్డు వేసుకుంటున్నారని దయ్యబట్టారు , మంచి నీరు వెళ్ళలేని ప్రాంతాలకు సైతం మద్యం ఎలా వెళ్తోందని ప్రశ్నించారు .

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని , ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు . పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో కళింగ ఉద్యమం వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments