తెలుగు తెరపై అగ్రకథానాయకుడిగా కృష్ణ తనదైన ముద్రవేశారు. హీరోగాను .. దర్శక నిర్మాతగాను ఆయన సాహసంతో కూడిన నిర్ణయాలు ఎన్నో తీసుకుని సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమాను కొత్తదనంతో పరుగులు తీయించిన కృష్ణ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలియజేశాడు.

“నా గురువు .. నా బలం .. నా స్ఫూర్తి మీరే. మీ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను .. ఎప్పటికీ మీరే సూపర్ స్టార్ .. హ్యాపీ బర్త్ డే నాన్న” అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇక మహేశ్ చేసిన ప్రతి సినిమాను కృష్ణ చూస్తుంటారు. ఆ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో .. ఎంతగా ప్రేక్షకాదరణను పొందుతుందనేది ఆయన చెబుతుంటారు. అలాగే ఎప్పటికప్పుడు మహేశ్ బాబు వెన్నుతడుతూ ఆయనను ప్రోత్సహిస్తుంటారు. తన తండ్రి మాదిరిగానే సూపర్ స్టార్ అనిపించుకున్న మహేశ్ బాబు, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేయడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments