సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్సకత్వంలో చేయనున్న విషయం తెలిసినదే ఈ సినిమాను అశ్వినీ దత్ , దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు . పూజా హెగ్డే కధానాయిక నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ భారతదేశంలో దేవభూమి గా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడున్ లో మొదలు కానుంది . డెహ్రాడున్ లో మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత కొంచెం విరామం తీసుకొని నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేసిందట . ఈ సినిమాకు కేయూ మాధవన్ ఛాయాగ్రాహకునిగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments