ఇప్పుడే ఎలా చెప్పగలను …?

0
278

తెలుగు సినీ చరిత్రలో అగ్రతారలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు . తెలుగు సినిమాలలో మొదటి స్కోప్ సినిమా , మొదటి కౌబాయ్ సినిమా , మొదటి కలర్ సినిమా ఇలా అన్ని రకాలుగా మొదట కృష్ణ ప్రయోగాలు చేశారు .  ఈరోజు ఆయన పుట్టినరోజు . ఈ సందర్భంగా సమ్మోహనం టీం కృష్ణను కలుకుసోని శుభాకాంక్షలు తెలిపారు  ఈ సందర్బంగా సమ్మోహనం అనే టైటిల్ పెట్టినందుకు చిత్రబృందాన్ని కృష్ణ అభినందించారు , ‘సమ్మోహనం’ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుసుకున్న ఆయన, తన సినిమాల్లో ‘పండంటి కాపురం’లో రొమాంటిక్ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఆ సినిమా 37 సెంటర్లలో 100 రోజులు ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా బయోపిక్ ల సందడి పెరుగుతోన్న విషయాన్ని ప్రస్తావించిన సుధీర్ బాబు, కృష్ణగారి బయోపిక్ లో హీరోగా ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని అడిగగా  ఎప్పుడో తీయబోయే సినిమా గురించి ఇప్పుడే ఎలా చెప్పగలను? అంటూ కృష్ణ నవ్వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here