విద్యావంతుడైన ప్రధానిని కోల్పోయాం …

551

ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ లాంటి ఉన్నత విద్యావంతుడైన ప్రధానిని మనం కోల్పోయామని ఆయన అన్నారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రధానే కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. భారత ప్రధాని కచ్చితంగా విద్యావంతుడు అయి ఉండాలని ఆయన అన్నారు. గతంలో కూడా మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మోదీ డిగ్రీ నకిలీదంటూ విమర్శించారు. ఇప్పుడు మరోసారి విద్యార్హతల గురించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పతనమవుతున్న రూపాయి విలువ దేశీయ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశంపై ఓ జాతీయ మీడియా కథనాన్ని రాసింది. ఈ నేపథ్యంలోనే, కేజ్రీవాల్ తనదైన శైలిలో మోదీపై సెటైర్లు వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here