జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్ర శ్రీకాకుళంలో ముగించి విజయనగరం జిల్లాలో కొనసాగిస్తున్న విష్యం తెలిసినదే . అయితే ఈరోజు పోరాట యాత్ర లో భాగంగా కురుపం , పార్వతీపురం , బొబ్బిలి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఆయన పోరాట యాత్ర షెడ్యూల్ ఈ విధంగా ఉంది

మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కురుపం లోని శాంత జంక్షన్ కు చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు . అనంతరం అక్కడినుండి బయలుదేరి పార్వతీపురం చేరుకొని సాయంత్రం 4 గం 30 నిమిషాలకు ఓల్డ్ బస్టాండ్ వద్ద బహిరంగసభలో ప్రసంగిస్తారు . మరల అక్కడినుండి బయలుదేరి బొబ్బిలి చేరుకొని సాయంత్రం 6 గంటలకు తాండ్ర పాపారాయుడు జంక్షన్ లో ప్రసంగిస్తారు . మధ్యలో ఈ ఊళ్ళల్లో జనసేన కార్యకర్తలు , యువతతో కలిసి పవన్ నిరసన కవాతులో పాల్గొంటారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments