సామాజిక భద్రతా పించన్ల పంపిణీపై అధికారులతో తన నివాసం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు . ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందికి పించన్లు అందిస్తున్నారు . కొత్తగా ఎన్ని పించన్లు మంజూరయ్యాయని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు . ప్రస్తుతం 47,26,341 మందికి ప్రతీనెలా పించన్లు అందజేస్తునట్లు అధికారులు వెల్లడించారు . 33,722 మంది మత్ష్యకారులకు తక్షణమే పించన్లు అందజేయాలని ఆదేశించారు .

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో సామాజిక భద్రతా పించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు . ప్రతీ ఏడాది రూ . 6 వేల కోట్లకు పైగా పించన్లకు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీనేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు . పించన్ల పంపిణీపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉందని , పించన్ల ద్వారా లబ్దిదారుల్లో ఆత్మగౌరవం పెంచామన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments