దిల్ రాజు నిర్మాతగా నితిన్ , రాశి ఖన్నా జంటగా నటిస్తున్నా సినిమా శ్రీనివాస కల్యాణం . పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందట.  ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట . అనుబంధాలు, ఆత్మీయతలు , మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతుందట. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందట. నిర్మాతగా దిల్ రాజు అప్పుడప్పుడు మానవ సంబంధాలను టచ్ చేసే కథాంశాలను అందిస్తూనే వస్తున్నారు. ఆ తరహా సినిమాలు ఆయనకి మంచిపేరు తెచ్చిపెట్టాయి కూడా. ఈ సినిమా కూడా అదే దారిలో వెళుతుందేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments