సుదీర్ బాబు , అదితీరావు హైదరీ జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్సకత్వంలో వస్తున్న చిత్రం సమ్మోహనం . శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జూన్ 15 న విడుదల చేయనున్నారు . ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది . ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది . దీనికి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు . ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం 9 గంటల 18 నిమిషాలకు కృష్ణ చేతులమీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు . అందుకు సంబందించిన ఒక పోస్టర్ ను చిత్రబృందం షేర్ చేసింది .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments