ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది.  ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎం.గాంధీ అనే రచయిత ఈ క్లైమాక్స్ తాను రాసుకున్న ఒక కథలోనిదనీ, దానిని సుకుమార్ కాపీ కొట్టారని రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఆయన ఎవరో తనకి గానీ .. తన నిర్మాతలకి గాని తెలియదనీ, ఎప్పుడూ ఎక్కడా కలుసుకోవడం కూడా జరగలేదని సుకుమార్ చెప్పారు. అందువలన కాపీ కొట్టారనే మాటలో అర్థమేలేదని అన్నారు. ‘రంగస్థలం’ సినిమా ముగింపు చాలా పాత సినిమాల్లో వున్నదేననీ .. దానిని తాను కొత్తగా రాసుకున్నానని చెప్పారు. ఆయన సమాధానంతో రచయితల సంఘం సంతృప్తి చెందింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments