కొన్ని దశాబ్దాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ . ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే .  తాజాగా ఆయనకు  అరుదైన గౌరవం దక్కింది . మైసూరు దత్త పీఠంలో గణపతి సచ్చిదానంద స్వామీ పుట్టినరోజు సందర్భంగా డా రాజేంద్ర ప్రసాద్ కు కళానిధి అవార్డును అందుకున్నారు . నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా , కామెడీ స్టార్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకొని వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నందుకు ఈ పురస్కారంతో గౌరవించారు .

ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద మాట్లాడుతూ  “నాకు హాస్యం అంటే చాలా ఇష్టం . హాస్యానికి కిరీటాన్ని పెట్టిన నటకిరీటికి ఈ కళానిధి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది ” అని అన్నారు . నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “నాలుగు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో తెలుగు ప్రేక్షకులను మెప్పించాను . నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ సద్గురు గణపతి సచ్చిదానంద స్వామివారి చేతుల మీదుగా కళానిధి అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments