జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్ హాలులో తమ స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా మంది పొట్ట చేత పట్టుకొని కూలీ పనులు చేసుకోడానికి వలసలు వెళ్ళే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చాయని విమర్శించారు . అవమానాలు అనేవి ఏపీ సీఎం చంద్రబాబుకో , గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలకో జరగవని వలసలు వెళ్ళే వాళ్లకు జరుగుతున్నాయని అన్నారు . గతంలో చాలా మంది తన వద్దకు వచ్చి వారి ఇబ్బందులు చెప్పుకునేవారని , సొంత ప్రాంతాన్ని వదిలి వచ్చినందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని అనే వారని తెలిపారు .

ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు లాంటి వారు అనుసరిస్తోన్న పాలసీల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు . రాజకీయ జవాబుదారీతనం లేకుండా పోతోందని విమర్శించారు . నిర్లక్ష్యం వహించబడిన ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి గురుంచి సమర్ధవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సి ఉందని అన్నారు . అప్పట్లో హైదరాబాద్ లో చేసిన తప్పే మళ్ళీ అమరావతిలో చేస్తున్నారని , పెట్టుబడులన్నీ ఒక్క చోటే పెడుతున్నారని , ఇలాగే కనక కొనసాగితే మళ్ళీ రాష్ట్రవిభజన జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు  .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments