ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది . నాబార్డ్ , కేంద్ర జల వనరుల కమిషనర్ , కేంద్ర ఆర్ధిక శాఖ మధ్య కుదిరిన ఎంవోఏకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటే కేంద్రం తమతో మళ్లీ ఎంవోఏ (మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాలని నాబార్డ్ గతంలో స్పష్టం చేసింది. ఫలితంగా కొత్త ఎంవోఏ సిద్ధమైంది. ఇప్పుడది ఆమోదం పొందడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు గతేడాది చెల్లించాల్సిన రూ.1089 కోట్లను కేంద్రం ఇప్పటికైనా విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments