ఉజ్వల యోజన పధకం కింద వంట గ్యాస్ ను పొందుతున్న మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు . ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన రుద్రమ్మ అనే మహిళను మోదీ పలకరించి తొలుత గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఎలాంటి ఉపయోగాలు పొందుతున్నారని ప్రశ్నించారు . దీనికి సమాధానంగా ఆ మహిళా గతంలో వంట చాలా కష్టంగా ఉండేదని , ఇప్పుడు సులువుగా వంట చేసుకుంటున్నానని బదులివ్వగా , ప్రధాని “నేను మీ ఇంటికి వచ్చినప్పుడు దోశలు చేసి పెడతావా ? అని అడగడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది .

అదేవిధంగా ఓడిశాకు చెందినా మహిళతో మాట్లాడుతూ ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చిన తరువాత పిల్లలు దేన్నీ ఇష్టంగా తింటున్నారని మోదీ ప్రశ్నించగా మ్యాగీ న్యూడిల్స్ , చౌమియాన్ , చట్ పాటా అని మహిళా చెప్పగా అక్కడ ఉన్నవారందరూ నవ్వారు . కాశ్మీర్ , అనంతనాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ , ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలని రామజన్ పర్వదినాల్లో నిత్యమూ ప్రార్దిస్తునట్టు తెలిపింది . ఆ సమయంలో తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న మోదీ, తన ఇంటి చుట్టుపక్కలా ముస్లిం కుటుంబాలు ఉండేవని, తనకు చాలా ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments