భరత్ అనే నేను చిత్రం తో విజయం అందుకున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి తో చేయనున్న విషయం తెలిసినదే . ఈ చిత్రానికి దిల్ రాజు ,అశ్వినీ దత్ కలిసి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . ఈ చిత్రంలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు . అయితే ఈ చిత్రం గురుంచి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది .

మహేష్ బాబు గడ్డం , మీసం తో సీరియస్ లుక్ లో ఉన్న సీరియస్ స్టిల్ తో పాటు రాజసం అనే టైటిల్ తో పోస్టర్ డిజైన్ చేశారు . ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు . ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments