ఓవర్సీస్ లో దూసుకెళ్తున్న మహానటి …

654

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి . ఈ చిత్రం విడుదలైప్పటినుండి మంచి ఆదరణ పొందుతోంది . నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించారు . మంచి టాక్ టో పాటు వసూళ్ళలో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది , ఓవర్సీస్ లో అయితే ప్రభంజనం సృష్టిస్తోంది .

ప్రస్తుతం మహానటి ఓవర్సీస్ లో 2.5 మిలియన్ల డాలర్ల కలెక్షన్లు సాధించింది . ఈ విషయాన్ని చిత్రబృండం అధికారికంగా ప్రకటించింది . ఇటీవల విడుదలైన సినిమాలు పెద్దగా పాజిటివ్ టాక్ లేకపోవడంతో మహానటికి తిరుగులేకుండా పోయింది . ఇదే విధంగా ఉంటె ఇంకా మరిన్ని రికార్డులను మహానటి సొంతం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here