సూపర్ స్టార్ తలైవా రజనీకాంత హీరోగా పా రంజిత్ దర్సత్వంలో హీరో ధనుష్ నిర్మిస్తున్న సినిమా కాలా . తాజా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది . ఈ ట్రైలర్ ను గమనిస్తే బస్తీ ని కాపాడే నాయకుడిగా రజనీకాంత్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది . నెగటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటులు నానాపటేకర్ నటించారు . ఈ ట్రైలర్ ఆయన చెప్పిన ఎవరైనా నన్ను ఎదురించాలంటే మరణమే అన్న డైలాగ్ ఆకట్టుకుంది . దీని బట్టి ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటుందో తెలుస్తోంది . రజనీ చెప్పిన రొమాంటిక్ డైలాగ్ “ఒక్కచోటూ వదల్లేదు , తన వెనుక పిచ్చోడిలా తిరిగా , నేనంటే అంత ఇష్టమా ? . చెప్పలేనంత .ఐ లవ్ యు” ను అభిమానులు  బాగా షేర్ చేసుకుంటున్నారు . ఈ సినిమాలో రజనీ కి జోడిగా ఈశ్వరి , హూమా ఖురేషి  నటిస్తున్నారు . ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు . ఈ చిత్రం జూన్ 7 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది .

https://youtu.be/ugkjeXAyrJE

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments