విజయవాడలో మూడు రోజులుగా మహానాడు సభలు జరుగుతున్న విషయం తెలిసినదే . ఈ రోజు చివరి రోజు మహానాడులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని అన్నారు . ఇంకా మాట్లాడుతూ “చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం” అని అన్నారు .
ప్రతీ వాడు టీడీపీ ని ఉద్దేసించి కుటుంబ పాలన గురుచి మాట్లాడుతున్నాడని , టీడీపీ ఈ స్థాయికి రావాడానికి చంద్రబాబే కారణమన్నారు . భవిష్యత్తులో సమర్ధుడైన నారా లోకేష్ సీఎం అయితే తప్పేంటి అని అన్నారు . ఇంకా మాట్లాడుతూ ఇక్కడ గల్లా జయదేవ్ ఉన్నారు , ఆయన సంపాదించిన ఆస్తి కొడుకుకి ఇవ్వరా అని అన్నారు . టీడీపీ అనేది చంద్రబాబు సొంతమని , మరి ఆయన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదన్నారు . చంద్రబాబు ఎందుకు ప్రధానమంత్రి కాకూడదని ప్రశ్నించారు . నరేంద్రమోదీ ఉన్నంత వరకు ప్రత్యేకహోడా రాదన్నారు .
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురుంచి మాట్లాడుతూ జగన్ కు అన్నీ వాళ్ళ తాతబుద్ధులే వచ్చాయన్నారు . ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారని చెప్పారు. చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్ పెట్టుకున్నారని పేర్కొన్నారు.