రంగస్థలం సినిమాతో సుకుమార్‌ సత్తా ఏంటో తెలిసింది జనాలకు. మాస్‌ సినిమాలు తీయలేరంటూ.. మాస్‌ ప్రేక్షకులను మెప్పించే సినిమాలను సుకుమార్‌ తీయలేరు అనే వారికి రంగస్థలంతో తన స్టామినా ఏంటో చూపించారు. ఈ సినిమా మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అన్ని సెంటర్స్‌లో రికార్డు కలెక్షన్స్‌ సాధించాయి. సుకుమార్‌ తదుపరి చిత్రం మహేశ్‌ బాబుతో ఉంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

భరత్‌ అనే నేను సినిమాతో మంచి విజయం సాధించిన ఈ సూపర్‌స్టార్‌ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మహేశ్‌ బాబు తన తరువాతి చిత్రం చేయబోతున్నారు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేయనున్నారు. ఈ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉండబోతోందట అంతేకాకుండా ఈ సినిమాలో మహేశ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments