రాజ్ తరుణ్ హీరోగా , అమైరా దస్తూర్ , పూజిత హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాజుగాడు . ఏ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా జూన్ 1 న విడుదల కానుంది . ఈ సందర్భంగా చిత్రం దర్శకురాలు సంజనా రెడ్డి మాట్లాడుతూ తమది శ్రీకాకుళం జిల్లా టెక్కలి అని , తాను కొన్ని రోజులు ఐటీ కంపెనీ లో పని చేశానని అలాగే కొన్ని రోజులు జర్నలిస్ట్ గా పనిచేశానని తెలియజేశారు. సినిమా రంగం పై ఉన్న ఆశక్తి తో ఓ స్నేహితుడి ద్వారా రాంగోపాల్ వర్మ వద్ద రౌడీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశానని , తాను డైరెక్టర్ కావడానికి రాంగోపాల్ వర్మనే స్పూర్తని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ శివ సినిమా 25 వసంతాల సమయంలో తాను అమలను కలిశానని , అప్పడు ఆమె ఓ యాడ్ ను డైరెక్ట్ చేయమన్నారని , తాను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని సంజనా రెడ్డి తెలియజేశారు . దాని తరువాత సినిమా ప్రయత్నాలు చేస్తుండగా రాజ్ తరుణ్ పరిచయంయ్యారని , ఆయనే రాజుగాడు నిర్మాతలకు పరిచయం చేశారన్నారు . ఈ చిత్రంలో కధానాయకుడి పాత్ర గురుంచి మాట్లాడుతూ హీరో కి క్లిప్టోమేనియా అనే ఒక డిసార్డర్ ఉంటుందని , ఈ వ్యాధి వాళ్ళ తెలియకుండానే దొంగాతానాలు చేస్తూ హీరో ఉద్యోగాలను కోల్పోతాడని తెలిపారు . రాజేంద్రప్రసాద్ , రాజ్ తరుణ్ మధ్య సన్నివేశాలు చాలా కామెడీ గా ఉంటాయని . ఇంటర్వెల్, క్లయిమాక్స్‌ సినిమాటిక్‌గా ఉన్నా మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుందన్నారు . సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందని సంజనా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments