వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా ప్రజసంకల్పయత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసినదే . ఇప్పుడు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది . ఇటీవల సినీనటుడు , రచయత పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన విషయం తెలిసినదే . ఇప్పుడు తాజాగా మరో సినీనటుడు పృథ్వి రాజ్ జగన్ ను కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు .

అనంతరం పృధ్వీ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. మండుటెండలను లెక్కచేయకుండా.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు.  ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే అధికారం. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. వైఎస్‌ జగన్‌ జననేత. మాట తిప్పని, మడమ తిప్పని మహాయోధులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ మాత్రమే. నేను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరే. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగిపోయిందంటే జగన్‌కు ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్ధమవుతోంది’  అని తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments