సుధీర్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా , మహేశ్ బాబు కు బావగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తానే సొంతంగా కష్టపడుతూ వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తున్నారు . ఇప్పుడు ఈయన నిర్మాతగా మారారు . ఎస్.బి పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశారు . ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో ఈ సంస్థకి సంబందించిన లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ , వీడియోను మరో నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు .

నిర్మాతగా మారాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సుదీర్ బాబును అల్లు అరవింద్ అభినందించారు . ఈ విషయంలో ఆయన సక్సెస్ సాధించాలని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ సందర్బంగా హీరో సుదీర్ బాబు మాట్లాడుతూ తన సొంత బ్యానర్ పై తొలి సినిమాను తానే చేస్తునట్టుగా తెలిపారు . ఇతర హీరోలతో కూడా ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తానన్నారు . ఈ కార్యక్రమంలో శివలెంక కృష్ణ ప్రసాద్ , లగడపాటి శ్రీధర్ , వంశీ పైడిపల్లి , శ్రీరామ్ ఆదిత్య , వెంకీ అట్లూరి , ప్రవీణ్ సత్తారు , శివ నిర్వాణ , సందీప్ కిషన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments