హైపర్ ఆది , తన పంచ్ డైలాగులతో అందర్నీ అలరించి ఇప్పుడు పంచ్ అంటే ఆది పేరు గుర్తొచ్చే స్థానానికి ఎదిగారు . సాధారణంగా ప్రతి గురువారం ఒక ప్రముఖ చానెల్ లో ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రస్తుతం సమాజం లో జరిగే విషయాలపై,తాజా రాజకీయ పరిణామాలపై  తనదైన  శైలిలో హైపర్ ఆది సెటైర్లు వేస్తుంటారు .

ఇటీవల కార్యక్రమంలో హైపర్ ఆది వేసిన సెటైర్ పై నటి శ్రీరెడ్డి ఫేస్బుక్ లైవ్లో స్పందించారు .  ఆవిడ మాట్లాడుతూ “ఆది గారూ మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు . మీరు మంచి రచయత , మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్ కూడా ఇస్తున్నారు . ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్‌ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను” అని ఆమె హెచ్చరించారు.

ఇంకా మాట్లాడుతూ తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడారని , “షర్టు విప్పరా … ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది ” అని ఓ డైలాగ్ చెప్పారని ఆమె తెల్పారు . “నేను తెలిపింది నిరసన , అది సెక్సీ నెస్ కాదు . ఆది నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు అని ఆమె అన్నారు . తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు . గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్‌ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments