ఇప్పుడు భారత చలన చిత్ర రంగంలో బయోపిక్ ల హవా నడుస్తోంది . చిత్ర నటీనటులు , క్రీడాకారుల బయోపిక్ లు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొండుతున్నాయి . భారత క్రికెట్ క్రీడాకారుడు ఎం ఎస్ ధోని బయోపిక్ వచ్చి మంచి ఆదరణ పొందింది . ఇటీవలే మహానటి సావిత్రి బయోపిక్ విడుదలై విజయవంతం అయ్యింది . సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది . ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ , తమిళ్ లో ఎంజీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే .
చాలా కాలం నుండి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ కూడా తెరక్కేక్కనుందని , ఆ సినిమాలో కీర్తి సురేష్ జయలలిత పాత్రలో నటించనున్నారని వార్తలు వచ్చాయి . అయితే అవన్నీ అబద్ధమని , ఇక తాను బయోపిక్ లలో నటించనని కీర్తి సురేష్ స్పష్టం చేశారు . దీంతో సావిత్రి పాత్రలో ఈ బ్యూటీకి లభిస్తున్న అభినందనలు చూసి కొందరు ఇతన నటీమణులు అలాంటి బయోపిక్ చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నారు. అలాంటి వారిలో రీమా కళింగళ్ ఒకరు. తమిళంలో భరత్‌కు జంటగా యువన్ యువతి చిత్రం ద్వారా పరిచయమైన ఈ కేరళా భామ, మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. ఆ మధ్య పెళ్లి చేసుకున్న రీమా కళింగళ్ తరువాత కూడా నటనను కొనసాగిస్తోంది. కీర్తీసురేశ్ మాదిరి ప్రశంసలు పొందడానికి ఎవరి బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను తమిళనాడు పురట్చి తలైవి జయలలిత బయోఫిక్‌లో నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా 18వ శతాబ్దంలో విప్లవ వీరనారిగా వాసికెక్కిన నంగేలి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తే ఆమె పాత్రలో తాను నటిస్తానని రీమా కళంగళ్ చెప్పింది.