వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజసంకల్ప యాత్ర ఈరోజు 174 వ రోజుకు చేరుకుంది . ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే . ఈరోజు ఆయన పాదయాత్ర షెడ్యూల్ ఈ విధంగా ఉంది .

ఈరోజు ఉదయం 7 గం 30 నిమిషాలకు ఉండి నియోజికవర్గంలోని పాలకోడేరు మండలంలో గల విస్సాకోడేరు నుండి పాదయాత్ర మొదలు పెట్టి గొరగనమూడి , పెన్నాడ , శ్రుంగవృక్షం , నందమూరు గరువు మీదగా ఉదయం 11 గం లకు వీరవాసరం చేరుకుంటారు . అక్కడ భోజన విరామం తీసుకుంటారు

మధ్యాహ్నం 3 గం 30 నిమిషాలకు వీరవాసరం నియోజికవర్గంలోని తలటాది తిప్ప నుండి బయలుదేరి బొబ్బన పల్లి మీదుగా సాయంత్రం 5 గం 30 నిమిషాలకు మత్స్య పురి చేరుకుంటారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments