జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రలో భాగంగా పాలకొండ నుండి బయలుదేరి రాజాం చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు . పవన్ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా , రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఒక్క జనసేన మాత్రమే ముందు నుంచి గళమెత్తి ప్రజల తరపున పోరాడుతోందన్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే ఈ నాలుగేళ్ళల్లో 29 సార్లు డిల్లీ వెళ్లి వచ్చా అంటారు తప్ప ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదన్నారు . ఇప్పటికి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో 36 సార్లు మాటమార్చారన్నారు . తాము  ప్రయత్నించకపోగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసైనికులను 9 రోజులు జైల్లో పెట్టించిన ఘనత ప్రభుత్వానిదని మండిపడ్డారు  . ప్రభుత్వంలోని అవినీతి కూడా ప్రశ్నించినందుకు జనసైనికులపై దాడి చేశారన్నారు . ఈ విధంగా జనసైనికులపై దాడి చేస్తే సహించబోనని హెచ్చరించారు .

ఇంకా మాట్లాడుతూ అక్కడ ఫ్లెక్సీ లో ఉన్న జగపతిరాజు గారికి ఓట్లు వేయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు కాని ఇప్పుడు తప్పులు ఎత్తి చూపితే పవన్ ఎవరో తెలియదని విమర్శించారు . అశోక గజపతిరాజు ఉద్దేశించి మాట్లాడుతూ రాజు గారు మాకు పెద్దలంటే గౌరవం ఉంది , కేంద్ర మంత్రిగా ఉంది పక్కనే ఉంటూ ఉద్దానం సమస్యను పట్టించుకోకుండా రాజభోగాలు అనుభవిస్తాం అంటే చూస్తూ ఊరుకోమన్నారు . ఈ ప్రాంతం నుండి ఒక జీఎంఆర్ ప్రపంచస్థాయి నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ సహకారం ఉంటె చాలా మంది  అభివృద్ధి చెందుతారని , తద్వారా శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుందన్నారు .

అభివృద్ధి అంటే అమరావతి ఒకటే కాదని రాజాం కూడా అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు .  మీరు ఇలానే ప్రజలను వంచిస్తూ పోతే ప్రజలు ఉద్యమాలకు దిగుతారని తద్వారా టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments