విజయవాడలో మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు . ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే తనకు బాధేస్తుందన్నారు . ఉద్దానం పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని , ఉద్దానంలో నీటి ప్లాంట్లు ఏర్పాటు చేశామని , కుప్పంకు కేటాయించిన తాగునీటి ప్లాంట్లను కూడా ఉద్దానానికే ఇచ్చామని , పవన్ కళ్యాణ్ ఈ విషయాలను గుర్తిచాలన్నారు . తాను పద్ధతి ప్రకారం నడుచుకుంటే తనపై ప్రతిపక్షం , విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని , తాను చేసిన తప్పులేంతో సాక్ష్యాలతో సహా నిరూపించాలని తాను మహానాడు సాక్షిగా సవాలు చేస్తున్నానన్నారు .

ఇంకా మాట్లాడుతూ తన తాత , తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా ఎప్పుడూ వ్యవహరించనన్నారు . రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు 68 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపై ప్రతిపక్షాలు నడుస్తున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తే తిప్పి కొట్టే బాధ్యత తమపై ఉందని అన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, తిరుమల వెంకన్నను రాజకీయాల్లోకి లాగుతున్నారని, వెంకన్న జోలికొస్తే ఎలా మాడిమసైపోతారో అందరికీ తెలుసని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments