ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియా తో మాట్లాడుతూ మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసినదే . ఈ పరిణామంతో  టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ తీరుతెన్నులపై విమర్శలు గుప్పించిన టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి స్పందిస్తూ, తనను బహిష్కరించే హక్కు వారికెక్కడదని ప్రశ్నించారు. టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, ఆ జెండా నందమూరివారిదని అన్నారు. కాగా, మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా రమణ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments