ఈరోజు ఉదయం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అనంతరం మీడియా తో మోత్కుపల్లి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసినదే . దీనితో తెలుగుదేశం వర్గాలలో అలజడి మొదలయ్యింది . ఈ విషయానికి పరిణామంగా మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ నుండి బహిష్కరిస్తునట్టు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ . రమణ ప్రకటించారు .
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి ప్రవర్తన కుట్రపూరితంగా , పార్టీని బలహానీనపర్చేదిగా ఉందని ఆరోపించారు . మొత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం సీఎం చొరవ చూపారని అయితే తమిళనాడు గవర్నర్ పదవిని కోరారన్నారు . కానీ కేంద్రం గవర్నర్ పదవి ఇవ్వలేదని తెలిపారు . నిరాధార ఆరోపణలతో టీటీడీపీని బలహీనపర్చి.. కేసీఆర్కు మోకరిల్లాలని చూస్తున్నారన్నారు. విపరీత ధోరణితోనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు.