జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యత అప్పగించాలి …

0
354
టీడీపీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని టీటీడీపీ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని… తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ కు కూడా తాను ఒక విన్నపం చేస్తున్నానని… ఎన్టీఆర్ కోసం ఒక స్థూపం ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని చెప్పారు. తెలంగాణలోని కీలక నేతలందరినీ ఎన్టీఆరే తయారు చేశారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here