ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు నివాళులు అర్పించారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . తనను గవర్నర్ చేస్తానని , రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత మోసం చేశారని అన్నారు . పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని , ఇప్పుడు కనీసం మహానాడు కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వాపోయారు . ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు . ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు .

ఇంకా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానన్నారు . తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . చంద్రబాబుకు పాలించే అర్హత కూడా లేదని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతికి కాని, వర్ధంతికి కాని ఘాట్ వద్దకు వచ్చి చంద్రబాబు ఎప్పుడైనా నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments