దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నారా కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలన్నారు . చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడి ఆయన ఎన్టీఆర్ వారసులలో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు . ఎన్టీఆర్ వారసులలో కేవలం బాలకృష్ణ కు మాత్రమే బాబు ఎమ్మెల్యే సీటు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెట్టడం చాలా దారుణమని , జయంతికి వర్ధంతికి తేడా తెలియని తన కొడుకుని మంత్రిని చేసి కాబోయే సీఎం అనడం సిగ్గుచేటని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని  , దీన్ని ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవాలని లక్ష్మీపార్వతి కోరారు . డిల్లీకి కి గులాంగిరి చేస్తూ ఆత్మగౌరవంతో వచ్చిన పార్టీని ఆత్మా వంచన పార్టీగా మార్చి అమ్మేందుకు సిద్ధపడుతున్న బాబు ఒక పెద్ద రాబందు అని మండిపడ్డారు . నిన్నటి వరకు సీఎం అవ్వటానికే బాబు గద్దెదించారని భావించానని ,కానీ ఎన్నికల ముందే ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చేతులు కలిపి ఎన్టీఆర్ ను ఓడించి ప్రధాని కాకుండా కుట్ర పన్ని అడ్డుకున్నారని తెలిసిందన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments