ఎన్టీఆర్ , ఈ పేరు వెనక ఒక చరిత్ర ఉంది . కృష్ణా జిల్లా నిమ్మకూరులో సామాన్య కుటుంబం లో జన్మించి తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు . ఆయన రాకతో తెలుగు సినీ పరిశ్రమకు కొత్త శోభ వచ్చింది . మనకు రాముడు , కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కాని ఆ నటసార్వభౌముడిలోనే అందరినీ చూసుకుంటున్నాం . సాంఘిక చిత్రాలైనా , పౌరాణిక చిత్రాలైనా ఎందులో అయినా ఆయనకు ఆయనే సాటి . ఆయన చిత్రసీమలో అగ్ర శిఖరానికి చేరుకోవడమే కాక రాజకీయాలోకి అడుగు పెట్టి ముఖ్యమంత్రిగా కూడా తనకు తానే సాటి అనిపించుకున్నారు . ఒక్కసారిగా కేంద్రం పై ధ్వజమెత్తి తెలుగువాడి పౌరుషం ఏమిటో చూపించారు . ఆయన తన పధకాల ద్వారా ప్రజల నీరాజానాలు అందుకున్నారు . ఈ విధంగా నటన , రాజకీయం , వ్యక్తిత్వ పరంగా ఇలా ఏ రకంగా ఆయన ఎవరూ పోటీ రాలేరు అనడంలో అతిశయోక్తి లేదు . అటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ జయంతి నేడు . ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు .

అయితే ఎన్టీఆర్ మనవడిగా మనకు పరిచయమై స్వశక్తితో ఎదిగి , ఆలోచనలలో , నటన , రూపం  , హావభావాలు ఇలా దేహమంతా అచ్చం తాత లక్షణాలే పుణికిపుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఈయనకు తాత ఎన్టీఆర్ అంటే ఎనలేని ప్రేమ , అభిమానం . ఈరోజు తాతగారి జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపిన ఈ పదాలు ప్రజల గుండెలు బరువెక్కేలా చేశాయి .

మీ పాదం మోపక తెలుగు చరిత్ర చిన్నబోతోంది

మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది

పెద్దమనసుతో ఈ ధరిత్రిని , ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా…

సదా మీ ప్రేమకు బానిస

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments