జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది . పవన్ పాలకొండలోని దుర్గ గుడి నుండి చెక్ పోస్ట్ వరకు అభిమానులు , జనసైనికులతో పాల్గొని అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు . పవన్ మాట్లాడుతూ పాలకొండ ప్రజలు తమ ప్రేమాభిమానాలతో తనను నలిపేశారన్నారు . నేతలు ఇచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటలు మార్చినందువల్లే తాను జనంలోకి వచ్చానని మరోసారి స్పష్టం చేశారు . ఏపీ కి ప్రత్యేక హోదా పై మొదటి నుంచి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనకబడేది కాదని అభిప్రాయపడ్డారు .

ఇంకా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారని , అడవిపుత్రుల పట్ల ప్రబుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా పవన్ తోటపల్లి రిజర్వాయర్ గురుంచి ప్రస్తావిస్తూ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని , రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు . రైతులు కంటతడి పెడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని వాపోయారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments