ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి…

0
182

దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానటుడు నందమూరి తారక రామారావు 95 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు . ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హరికృష కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి , స్మరించుకున్నారు . అనంతరం నందమూరి హరికృష్ణ మీడియా తో మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు . నేడు ప్రతి ఇంట ఒక బిడ్డ ఎన్టీఆర్ లా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ తనకు , తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ జయంతి ఒక పర్వదినం లాంటిదని హరికృష్ణ వెల్లడించారు . ఎన్టీ రామారావు గురుంచి చెప్పడానికి తరాలు , యుగాలు సరిపోవని అన్నారు . బడుగు బలహీన వర్గాల ఉన్నతి , అభివృద్ధి కోరుకున్న గోప్పనయాకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు . ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని , అలాగే ఆ యుగపురుషుడి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుగు రాష్ట్రాలలో పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు ప్రభుత్వాలను కోరారు .

తెలుగు వారికి ఒక బాష ఉందని ఎన్టీఆర్ నిరూపించారు , తెలుగు రాష్ట్ర ప్రజలు తరాలు చెప్పుకునే సేవ చేశారని హరికృష్ణ తెలిపారు . తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు .

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here