సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , ప్రేమ కధలను గొప్పగా ఆవిష్కరించగల దర్శకుడు కరుణాకరన్ కాంబినేషన్లో తెరకెక్కుతున చిత్రం “తేజ్ ఐ లవ్ యు ” . ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని డబ్బింగ్ కార్యక్రమాలు చివరికి వచ్చాయి . దీనితో సాయిధరమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో లో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు .

అందుతున్న సమాచారం ప్రకారం కిషోర్ తిరుమల తో సినిమా చిత్రీకరణ ముగించుకున్న తరువాత తేజు తన తదుపరి చిత్రం దర్శకుడు గోపీచంద్ తో చేయనున్నారట . భగవాన్ – పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించానున్నారట . ఈ చిత్రం లో తేజు లుక్ కొత్తగా ఉంటుందనీ , ఆయన నటనలో కొత్త కోణాన్ని గోపీచంద్ ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది . మరి గతంలో విన్నర్ సినిమా ద్వారా తనకు అపజయం రుచి చూపించిన గోపీచంద్ కు సాయిధరమ్ మరో అవకాశం ఇవ్వడం గురుంచి ఫిలిం నగర్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments