సాక్షి ఛానెల్ లో ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమం ద్వారా అందరికీ సుపరిచితులైన జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . సెక్రటరీ జనరల్ గా సబీనా ఇంద్రజిత్ ఎన్నికయ్యారు . ఐజేయూ 2018 కేంద్ర ఎన్నికల అధికారి ప్రేమ్నాధ్ భార్గవ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు . త్వరలో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లీనరీలో వీరిద్దరూ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు . మునుపటి అధ్యక్షులు సింహా అమర్ చాలా సమర్ధవంతమైన నాయకులని ,ఆయన న్యాయకత్వంలో ఐజేయూ ఇంకా అంచలెంచలుగా ఎదిగి భావ ప్రకటన స్వేచ్ఛ , పత్రికా స్వేచ్ఛ పూర్తి స్థాయిలో రావాలని ప్రకటన ద్వారా తెలియజేశారు .

దేవులప్పల్లి అమర్ 1975 నుండి అంటే దాదాపు 43 ఏళ్ల నుండి అనేక పత్రికలలో , అనేక హోదాలలో పనిచేశారు . ఆయన మొదట ప్రజాతంత్ర పత్రికలో కరెస్పాండంట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు . దాని తరువాత ఆంధ్రప్రభలో స్టాఫ్ కరెస్పాండంట్ గా చేరి అసిస్టెంట్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు . ఈనాడు ,ఉదయం , ఆంధ్రభూమి పత్రికలలో కూడా పనిచేశారు . దేవులపల్లి అమర్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కు రెండు సార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు . గతంలో ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీకి ప్రెసిడెంట్ గా పనిచేశారు .

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments