విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో జరుగుతున్న మహానాడు రెండో రోజు సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ ప్రధానాకర్షణగా నిలిచారు. తొలిరోజు సమావేశాలకు హాజరుకాలేకపోయిన ఆయన, రెండో రోజు సమావేశం ప్రారంభానికి ముందే సభాస్థలికి చేరుకోగా, అభిమానులు, కార్యకర్తలు బాలయ్యను పలకరించేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. బాలకృష్ణ సైతం వారితో ఆప్యాయంగా మాట్లాడారు.

ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, తాను తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ న్యాయం చేయగలడనే నమ్ముతున్నట్టు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని చెప్పారు. భవిష్యత్ తరాలకు గుర్తుండేలా సినిమాను రూపొందిస్తామని అన్నారు. క్రిష్, తన కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కన్నా ‘ఎన్టీఆర్’ గొప్ప బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments