అఖిల్ , అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు . తన రెండోవ సినిమా అఖిల్ ప్రేక్షకుల మన్ననలను అందుకుంది .ఇప్పుడు తన మూడవ సినిమా తొలిప్రేమ సినిమా విజయం సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసినదే . ఈ సినిమా మొదటి షెడ్యూల్ లండన్ లో ప్లాన్ చేశారు . ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించనున్నారు .

ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది . ఈ సినిమాకు “మిస్టర్ మజ్ను” అనే టైటిల్ దాదాపు ఖరారు చేసినట్టు ఈ వార్త యొక్క సారాంశం . రెండోవ సినిమాకు అఖిల్ తన తండ్రి నాగార్జున సినిమా “హలో బ్రదర్” నుండి టైటిల్ తీసుకున్నారు , ఇప్పుడు నాగార్జున హిట్ సినిమా అయిన “మజ్ను”  పేరును తీసుకొని దానికి మిస్టర్ ను కలుపుకుంటున్నారు . జూలై రెండోవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments