రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . ఈ విషయం పై అనేక వర్గాల నుండి తీవ్ర విమర్శలు వెల్లివేత్తాయి . దాంతో సోమిరెడ్డి స్పందించారు . ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ రమణదీక్షితులు పై తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని , క్షమాపణ కోరుతున్నానని అన్నారు . పొరపాటున విజయసాయి రెడ్డిని అనాల్సిన మాటలు రమణదీక్షితులను అన్నానని తెలిపారు . సీఎం ఇంట్లో నగలు ఉన్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు ఆగ్రహం తెప్పించాయని అన్నారు . ఇంకా మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తినని  అన్నారు . ఈ విధంగా ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి ని వేరే రాష్ట్రంలో అయితే లోపల వేసేవాళ్ళని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments