తన ఆలోచలనలతో ఎప్పుడూ వివాదాల మధ్య ఉండే రాంగోపాల్ వర్మ ఒక ఆశక్తికరమైన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు . సినిమా రంగంలోకి ప్రవేశించి రాణించాలని భావించే యువతీ యువకులకు వారికి కావలసిన శిక్షణ కల్పించేలా తాను ఫిలిం స్కూల్ స్థాపించనున్నట్లు ప్రకటించారు . నూతన టెక్నాలజీ తో పాటు డిఫరెంట్ మేకింగ్ ను నేర్పిస్తామని , న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్ , డాక్టర్ శ్వేతా రెడ్డిల సహకారంతో ఈ స్కూల్ ను ప్రారంబిస్తామని చెప్పారు . దీనికి “ఆర్జీవీ అన్ స్కూల్” అని పేరు పెట్టానన్నారు . దీనికి సంబందించిన సమాచారాన్ని త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments