జనసేన పోరాట యాత్ర లో భాగంగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు . ఈ సందర్భంగా నరసన్నపేట బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ టీడీపీ ఉమ్మడిగా తిని , ఒంటరిగా బలవాలని అనుకుంటోందని , జనసేన సైనికుల వల్లే ఈరోజు టీడీపీ అధికారంలో ఉందని అన్నారు .

ఉత్తరాంధ్రలో తాను ఎక్కడికి వెళ్ళినా కన్నీటి గాధలే వింటున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు . తాను బస చేసే ప్రాంతాలలో కరెంటు కట్ చేయించి , తనపై దాడులకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారని అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు . ఈ సందర్భంగా కేంద్రం తీరును పవన్ ఎండగట్టారు . ఎపీకి ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు . తాము ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని , హామీలు నెరవేర్చకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని , నాలుగేళ్ళలో 36 సార్లు మాతమార్చారన్నారు . ప్రత్యేక హోదా కోసం జనసేన చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు . ఇక ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి “ఇక మాటలు లేవు చేతలే” అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments