జనసేన అధినేత తన పోరాట యాత్రలో భాగంగా ఆముదాలవలస బహిరంగ సభలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అవసరమైతే జగన్ ను కూడా ఆలింగనం చేసుకుంటారన్నారు . 2019 ఎన్నికలలో కాంగ్రెస్ , టీడీపీ , వైసీపీ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు . ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు . జనసేన ప్రజల్లోకి రావడానికి కారణం చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ , భూ కబ్జాలే కనిపిస్తున్నాయని , భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వచ్చే పరిస్థితి ఉందంటూ వ్యంగంగా మాట్లాడారు . ఏపీలో ఎక్కడ భూమి కనిపించినా టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని , భూమిని మట్టిని దోచుకునే వారికి చివరికి మట్టిలోనే కలిసిపోవాలన్నారు . టీడీపీ నాయకులు ఏపీని కబ్జా ఆంధ్రప్రదేశ్ గా మార్చాని ఘాటుగా స్పందించారు .

వంశధార ప్రాజెక్ట్ గురుంచి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా అక్కడి ప్రజలను మెడపట్టి బయటకు గెంటేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు . వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు మోసం చెయ్యొద్దని ప్రభుత్వం పై మండిపడ్డారు . ఏపీలో ఎక్కడికెళ్ళినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారని , బాదితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments